: కామాంధుడీ బాబాయి!
విలువలు నశించిపోతున్నాయి. మనుషుల్లో క్రూరత్వం బుసలు కొడుతోంది. మానవత్వం మంటగలిసిపోయిన మనిషి వావి వరసలు మరచిపోతున్నాడు. తాజాగా వెలుగుచూస్తున్న అకృత్యాలు సభ్యసమాజం తలెత్తుకోలేకుండా చేస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే ఆడపిల్లల పాలిట రాక్షసులుగా మారుతున్నారు. స్వంత బాబాయే ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తెనాలి సమీపంలోని చినరావూరు తోటలో 13 ఏళ్ల బాలికపై బాబాయే దుశ్చర్యకు పాల్పడ్డాడు.