: వింబుల్డన్ ఫైనల్లో బర్తోలీ


టెన్నిస్ తెరమీద మరో కొత్త తార దూసుకొస్తోంది. మారియా బర్తోలీ రెండోసారి వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించింది. బెల్జియం దేశానికి చెందిన కిర్ స్టెన్ ఫ్లిప్కిన్స్ ను సెమీఫైనల్ మ్యాచ్ లో 6-1,6-2 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో గాయంపాలైనా ఫ్లిప్కిన్స్ చక్కని పోరాట పటిమ కనబరిచిందని బర్తోలీ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది. 2007 వింబుల్డన్ లో ఫైనల్లో ప్రవేశించినా టైటిల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. తాజాగా సీనియర్ ప్లేయర్ వింబుల్డన్ విన్నర్ అయిన అమేలీ మౌరెస్మో దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కాస్త కలిసివచ్చిందని పేర్కొంది. ఈ ఫాం కొనసాగిస్తే టైటిల్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News