: ఇళ్లు కోల్పోయిన వారికి 6 నెలల పాటు 1500 అద్దె చెల్లింపు


ప్రకృతి విలయానికి విలవిల్లాడిన ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకునేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం సుమారు 22 గ్రామాలు గల్లంతయ్యాయని అధికారులు తెలిపారు. వీరందర్నీ ఆదుకునేందుకు నెలకు సరిపడా ఉచిత రేషన్, రాయితీపై కిరోసిన్ సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇళ్లు కోల్పోయినవారికి 6 నెలల పాటు 1500 రూపాయల అద్దె చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మరో వైపు గల్లంతయినవారి దహన సంస్కారాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరైనా రక్షణ చర్యలు అవసరమైనవారు ఉన్నారా? అన్న దిశగా ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది.

  • Loading...

More Telugu News