: 23 లోగా తెలంగాణ ప్రకటిస్తే కాంగ్రెస్ కు టీఆర్ఎస్ మద్దతు
తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకుంటోంది. మరోసారి డెడ్ లైన్ తో తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 23 లోగా తెలంగాణ ప్రకటిస్తే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ప్రజల్ని కోరతామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేకనే ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలలోపే మంత్రి వర్గ తీర్మానంతో తెలంగాణ ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.