: సరిపడా బొగ్గు లేదు... ఈ ఏడూ తప్పని విద్యుత్ కష్టాలు


ఈ ఏడాది కూడా విద్యుత్ కష్టాలు తీరేలా లేవు. విద్యుత్ రంగంలో ఇంధన సంక్షోభం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు లభ్యత అవసరానికంటే 14 శాతం తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం ఓ అంతర్గత నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 548 మిలియన్ టన్నుల బొగ్గు అవసరముంది. అయితే ప్రస్తుతం కేవలం 473 మిలియన్ టన్నుల కోల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మొత్తం బొగ్గు నిల్వల్లో 377 మిలియన్ టన్నుల బొగ్గు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తుండగా, 36 మిలియన్ టన్నుల బొగ్గును మన రాష్ట్రానికి చెందిన సింగరేణి కాలరీస్ సమకూర్చుతోంది.

  • Loading...

More Telugu News