: లంచాల కేసులో మాజీ మంత్రి బన్సల్ 39 వ సాక్షి


రైల్వేశాఖలో లంచాల కేసులో ఆ శాఖ మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ పేరును సీబీఐ సాక్షుల జాబితాలో చేర్చింది. రైల్వేశాఖలో అవినీతి రాజ్యమేలుతుందన్న ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనల నేపధ్యంలో, స్వయానా బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. దీంతో పవన్ కుమార్ బన్సల్ రాజీనామా చేశారు. సీబీఐ మొన్న ప్రకటించిన నిందితుల జాబితాలో అతని పేరును చేర్చలేదు. దీంతో సీబీఐ విశ్వసనీయతపై వివాదం రేగుతూనే ఉంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తెలియకుండా కుంభకోణం జరుగుతుందా? అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో సీబీఐ నిందితుల జాబితాలో బన్సల్ పేరు చేర్చుతుందని అనుకున్నారు. కానీ సాక్షుల జాబితాలో 39 వ సాక్షిగా అతని పేరును సీబీఐ చేర్చింది.

  • Loading...

More Telugu News