: వేలాన్ని అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని రక్షించిన పోలీసులు
ప్రజాస్వామ్యానికి అర్ధం మారిపోతోంది. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవ్వాల్సిన ప్రజాప్రతినిధులు పలు రకాల ప్రలోభాల ద్వారా ఎన్నికవుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలూరు పంచాయతీ సర్పంచి పదవి వేలాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం గ్రామస్థులు సర్పంచి పదవిని వేలం వేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గ్రామస్థులు వేలాన్ని విరమించుకున్నారు. దీంతో పోలీసులు ప్రజాస్వామ్యాన్ని రక్షించారని విద్యావంతులు అభినందిస్తున్నారు.