: పాక్ చీఫ్ సెలెక్టర్ రాజీనామా


పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఇక్బాల్ ఖాసిం తన పదవికి రాజీనామా చేశారు. బుధవారంతో తన పదవీ కాలం ముగియడంతో ఆయన తనను రిలీవ్ చేయాలని బోర్డును కోరారు. ఆయన చివరగా విండీస్ టూర్ కు పాక్ జట్టును ఎంపిక చేశారు. 2010 లో చీఫ్ సెలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఖాసిం 2012 జూన్ వరకూ బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత బోర్డు అతనికే సెలెక్టర్ గా కొనసాగింపు నివ్వడంతో నేటి వరకూ ఆ పదవిలో కొనసాగారు. తాజాగా పాక్ జట్టు పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహించారాయన. మిస్బావుల్ హక్ ను పాక్ జట్టు కెప్టెన్ గా నియమించి సాహసోపేతమైన నిర్ణయం కూడా ఆయన తీసుకున్నారు.

  • Loading...

More Telugu News