: విజయవాడ-గుంటూరును మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం: బాబు
తాము అధికారంలోకి వస్తే విజయవాడ-గుంటూరును మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నేడు జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కొల్లేరు సరస్సుపై ఆధారపడిన వాళ్ళను ప్రభుత్వం పట్టించుకోకపోగా, వారికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కొల్లేరు విషయంలో రాష్ట్రంలో ఒకమాట, కేంద్రంలో మరోమాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కొల్లేరు వాసులకు న్యాయం జరిగేవరకు టీడీపీ అండగా నిలుస్తుందని బాబు భరోసా ఇచ్చారు.