: రెండో వారంలో అనంతపురంలో సమైక్యాంధ్ర సభ
సమైక్య సెగ రాజుకుంటోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయనున్నారన్న కేంద్ర ప్రభుత్వ సంకేతాలతో మరోసారి తమ ఐక్యతను చాటేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సన్నద్దమౌతున్నారు. ఈ నెల రెండో వారంలో సమైక్యాంధ్ర బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఈ సభకు పార్టీలకతీతంగా అన్ని వర్గాల వారు తరలి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. డిసెంబర్ 9 ప్రకటన రద్దు చేసిన ఘనత సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులదేనని ఆయన తెలిపారు. కేంద్రం నిర్ణయం వెలువడ్డాక ఎవరేం మాట్లాడినా ప్రయోజనం ఉండదన్న శైలజానాథ్, ఇప్పడే స్పందించాలని కోరారు.