: స్నోడెర్న్ కు ఆశ్రయమిస్తామన్నందుకు అమెరికా హైడ్రామా


వియన్నాలోని 14 గంటల హైడ్రామా తరువాత ఎట్టకేలకు బొలీవియా అధ్యక్షుడు సాచా లోరెటీ స్వదేశానికి చేరుకున్నారు. స్నోడెర్న్ కు ఆశ్రయమిస్తామని హామీ ఇచ్చినందుకు అమెరికా హైడ్రామా క్రియేట్ చేసిందని బొలీవియా ప్రకటించింది. ప్రపంచ దేశాలపై అమెరికా చేస్తున్న గూఢచౌర్యాన్ని ఆధారాలతో బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగి స్నోడెర్న్, మాస్కో నుంచి బొలీవియా అధ్యక్షుడు ఇవో మోరెల్స్ ప్రయాణిస్తున్న విమానంలో ఉన్నాడన్న అనుమానంతో, యూరోపియన్ యూనియన్ ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ దేశాలు ఆ విమానాన్ని అడ్డుకుని దారి మళ్లించాయని బొలీవియా ఆరోపించింది. ఇది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనేనని అమెరికాలో బొలీవియా రాయబారి సాచా లోరెటీ ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన అగ్ర రాజ్యాన్ని డిమాండ్ కూడా చేశారు.

  • Loading...

More Telugu News