: మళ్ళీ జట్టులోకి గంభీర్?


గౌతమ్ గంభీర్.. ఢిల్లీ సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్ జతగా భారత్ కు చిరస్మరణీయ విజయాలు అందించిన డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఈ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ కు మరో చాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనకు సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో గౌతీకి ఓ చాన్స్ ఇచ్చి చూడాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీలోని ఓ వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో గంభీర్ భవిత్యం రేపటి సెలక్షన్ కమిటీ సమావేశంలో తేలనుంది.

  • Loading...

More Telugu News