: అధిష్ఠానం ఎవరికీ భయపడదు: పొన్నం


తెలంగాణ అంశంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికీ తలొగ్గబోదని ఆ పార్టీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కరీంనగర్లో నేడు మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరినీ మభ్యపెట్టబోదని చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రంపై హైకమాండ్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని పొన్నం పేర్కొన్నారు. ఏదేమైనా తెలంగాణ ప్రకటించాల్సింది కేంద్రమే అని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News