: మా పార్టీ మోసం చేయదు: డీఎస్ ధీమా
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేయదని అంటున్నారు పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్. తన నివాసంలో ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీది 130 సంవత్సరాల చరిత్ర అని.. పంచాయతీ ఎన్నికల కోసం మభ్యపెట్టడంలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై అధిష్ఠానం సరైన నిర్ణయమే తీసుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీపై మాట్లాడుతూ.. వారు కాంగ్రెస్ లో విలీనమైతే సంతోషిస్తానని డీఎస్ పేర్కొన్నారు. తానే విలీనానికి సంధానకర్తగా వ్యవహరిస్తానని కూడా ఆయన అన్నారు.