: ప్రాణం తీసిన పెంపుడు కుక్క


రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలం ఔనుపల్లిలో పెంపుడు కుక్క ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. సర్పంచి ఎన్నికల గురించి గ్రామస్తులు చర్చిస్తుండగా.. ఈ పెంపుడు కుక్క ఒక్కసారిగా వారిపైకి దాడి చేసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మరణించాడు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారికి సమీప ఆసుపత్రిలో వైద్య సాయం అందిస్తున్నారు. కాగా, ఆ పెంపుడు కుక్కకు పిచ్చి పట్టిందని భావిస్తున్నారు. తాజా ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు లోనయ్యారు.

  • Loading...

More Telugu News