: నా బిడ్డ విషయంలో మీ ఉత్సాహమేంటి?: షారూఖ్ చిందులు


సర్రోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇటీవలే మూడో బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మీడియాపై విరుచుకుపడ్డాడు. తన బిడ్డ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోందంటూ ప్రసారసాధనాలపై చిందులు తొక్కాడు. ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ.. తన మూడో సంతానం విషయాన్ని నిర్ధారించిన కింగ్ ఖాన్, అంతకుమించి వివరాలు తెలుపలేదు. తన బిడ్డ విషయంలో మీ పరిశోధన పట్ల కాస్తంత సంయమనం పాటించండంటూ మీడియాకు సలహా ఇచ్చాడు. సమయం వస్తే అన్ని విషయాలు పంచుకుంటానని చెప్పి మీడియా సమావేశాన్ని ముగించాడు. గత కొంతకాలంగా షారూఖ్ దంపతులు మూడోబిడ్డను పొందారని పలు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తన మూడో సంతానం జనన ధ్రువీకరణ పత్రం కోసం షారూఖ్ దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News