: తెలంగాణవాదుల ఐక్యతే ఉద్యమానికి శ్రీరామరక్ష: కేసీఆర్
తెలంగాణవాదుల ఐక్యతే ఉద్యమానికి శ్రీరామరక్ష అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు అన్నారు. కార్మిక సంఘాలు రేపు, ఎల్లుండి తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, నేతలతో పాటు కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని సూచించారు.
వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ వాదం బలమేంటో చూపుతామని హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసమే టీఆర్ఎస్ ఉద్భవించిందని, ఉద్యమ ప్రస్థానంతో సమాంతరంగా రాజకీయ పయనాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ వాదం బలమేంటో చూపుతామని హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసమే టీఆర్ఎస్ ఉద్భవించిందని, ఉద్యమ ప్రస్థానంతో సమాంతరంగా రాజకీయ పయనాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.