: ముళ్ళపొదల్లో 'బంగారుతల్లి'


రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బాలికలపై వరాల వర్షం కురిపిస్తూ వారిని 'బంగారుతల్లి' పథకంలో ప్రధాన లబ్దిదారులుగా ప్రకటిస్తుంటే.. మరోవైపు ఆడశిశువులను నిర్దాక్షిణ్యంగా వదిలించుకోవాలని చూస్తున్న తల్లిదండ్రుల సంఖ్యా తగ్గడంలేదు. తాజాగా, రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట మండలం గ్రేటువానంపల్లెలో ఈ దారుణం చోటు చేసుకుంది. రోజుల శిశువు ముళ్ళపొదల్లో పడివుండగా స్థానికులు గుర్తించారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆ ఆడశిశువును ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News