: శ్రీవారి సేవలో 'సినీ' నాని
టాలీవుడ్ యువ హీరో నాని నేడు తిరుమల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు. అర్థాంగితో కలిసి వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నాడు. నాని సాధారణ భక్తుల వలే అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్నాడు. కాగా, దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన నాని దంపతులను చూసేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.