: రాహుల్ ద్రావిడ్ కు పితృవియోగం


భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తండ్రి శరత్ ద్రావిడ్ (79) కన్ను మూశారు. శరత్ ద్రావిడ్ బెంగళూరులో నిన్నరాత్రి తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత నాలుగేళ్ళుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల కర్ణాటక క్రికెట్ వర్గాలు రాహుల్ ద్రావిడ్ కు సంతాపం తెలిపాయి. సన్నిహితుడు అనిల్ కుంబ్లే.. ద్రావిడ్ కుటుంబ సభ్యులను పరామర్శించాడు. కాగా, ద్రావిడ్ తండ్రి శరత్ 'కిసాన్ జామ్' తయారీ సంస్థలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అందుకే, బాల్యంలో రాహుల్ ద్రావిడ్ ను మిత్రులందరూ ముద్దుగా 'జామీ' అని పిలుచుకునేవారు.

  • Loading...

More Telugu News