: మంత్రిగారి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారికి చెందిన గల్లా ఫుడ్స్ కంపెనీ (జ్యూస్ ఫ్యాక్టరీ) లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేటలోని ఈ ఫ్యాక్టరీలో అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో 800 టన్నుల మామిడిపళ్ళు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం వెంటనే స్పందించింది. హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నాలు ఆరంభించారు. కాగా.. సుమారు రూ.1 కోటి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తుండగా.. రూ.2 కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు గల్లా ఫుడ్స్ యాజమాన్యం అంటోంది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.