: రోడ్ మ్యాప్ నాటకం కుట్రలో భాగం: గద్దర్
రాహుల్ గాంధీని ప్రధానిని చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ తెలంగాణపై రోడ్ మ్యాప్ నాటకమాడుతోందని ప్రజాగాయకుడు గద్దర్ ఆరోపించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లోకి వెళ్లేందుకే కాంగ్రెస్ దీన్ని రహదారిగా మలచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ సాధన సమావేశంలో తెలంగాణ సాధించడానికి ఏ నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. గతంలో జరిగిన సహకార సంఘాల ఎన్నికల తరహాలోనే ప్రస్తుత ఎన్నికలను నిర్వహించి తెలంగాణ వాదాన్ని నిర్వీర్యం చేయబోతున్నారని గద్దర్ హెచ్చరించారు.