: రాష్ట్ర విభజన పరిష్కరించి అనిశ్చితికి తెర దించాలి: సీపీఐ
రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్రం వెంటనే పరిష్కరించి, అనిశ్చితికి తెరదించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్రకార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశంలో ఆ పార్టీలకు చెందిన నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 6 న విద్యార్థి సంఘాలు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్ కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నెల 17 న కాకినాడలో వామపక్షాల సదస్సు నిర్వహించనున్నామని తెలిపిన వామపక్ష నేతలు, గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.