: జింబాబ్వే పర్యటనకు టీమిండియా ఎంపిక ఎల్లుండి


జింబాబ్వే పర్యటనలో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ఎంపిక చేయనున్నారు. జులై 24 నుంచి మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా.. జింబాబ్వేతో తలపడనుంది. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ముక్కోణపు టోర్నీలో పాల్గొంటున్న భారత్ అటునించి అటే జింబాబ్వే పయనమవుతుంది. ఈ పర్యటనకు జట్టును ఎంపిక చేసేందుకు చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ అధ్యక్షతన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ముంబయిలో ఎల్లుండి సమావేశం కానుంది. కాగా, ఈ టూర్ కు ధోనీ మళ్ళీ జట్టులోకొచ్చే విషయంలో అనిశ్చితి నెలకొంది. భారత రెగ్యులర్ కెప్టెన్ గాయం తీవ్రతపై ఇంతవరకు అధికారిక సమాచారం అందలేదు.

  • Loading...

More Telugu News