: సాధన సభ ద్వారా నేతలు ఐక్యత చాటారు: పాల్వాయి
సాధన సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్యత చాటారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అభినందించారు. త్వరలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఖాయమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికైతే రోడ్ మ్యాప్ ఎందుకు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. లగడపాటికి రాజ్యాంగం పట్ల అవగాహన లేదని మండిపడ్డ పాల్వాయి, తెలంగాణ ఏర్పాటు చేసి ఆంధ్రాకు ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగాక చంద్రబాబు, జగన్ లకు రాజకీయ భవిష్యత్ ఉండదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమైతే రెండు పార్టీలకు శ్రేయస్కరమని ఆయన అన్నారు.