: ఉత్తరాఖండ్ బాధితుల తరలింపు పూర్తయింది
ఉత్తరాఖండ్ వరదబాధిత యాత్రీకుల తరలింపు నేటికి పూర్తయింది. వరద బాధిత ప్రాంతాల్లో చిక్కుకున్న యాత్రీకులను, వారి స్వస్ధలాలకు సురక్షితంగా తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్ డీఎంఏ) తెలిపింది. 15 రోజులుగా నిర్విరామంగా పలు శాఖల సమన్వయంతో యాత్రీకులకు సహాయక చర్యలు అందించిన విపత్తుల నిర్వహణ శాఖ ఈ ప్రక్రియ ముగిసిందని ప్రకటించింది. ఇక నుంచి స్థానికులకు సహాయ సహకారాలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని తెలిపింది.