: తెలంగాణకు భారీ వర్షం
రానున్న 48 గంటల్లో తెలంగాణ లో భారీ వర్షం కురవనుందని విశాఖ వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు, నైరుతి రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా కదులుతున్నాయని వాటి ప్రభావంతో వర్షాలు భారీగా కురవనున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు బీమ్ నగర్ లో 9 సెంటీమీటర్లు, నిజామాబాద్ లో 7 సెంటీమీటర్లు, నవీపేటలో 6, మంచిర్యాల, ములుగు, రుద్రార్, నిజాం సాగర్ లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.