: మీనా కుమారిలా నటించాలనుంది: సోనమ్ కపూర్
ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి పాత్రలో నటించాలనుందని అనిల్ కపూర్ కుమార్తె, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. ముంబైలో రాన్ జానా, భాగ్ మిల్కా భాగ్ విజయవంతమైన సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్, మీకు ఏ పాత్ర అంటే ఇష్టం? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, సహజ నటి మీనాకుమారి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె జీవిత చరిత్రను సినిమాగా తీస్తే అందులో నటించాలనుందంటూ తన కోరికను వెల్లడించింది. మీనాకుమారి జీవితం విషాధభరితమని పేర్కొన్న సోనమ్, ఆ పాత్రలో తాను రాణిస్తానని తెలిపారు. ఆరేళ్ల క్రితం బాలీవుడ్ లో నటిగా అడుగుపెట్టిన సోనమ్ 12 సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది.