: సీఎమ్ ముందుకు శంకర్ రావు అరెస్ట్ వ్యవహారం


ఎమ్మెల్యే శంకర్ రావు అరెస్ట్ వ్యవహారం సీఎమ్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో హోం మంత్రి సబిత, డీజీపీ దినేష్ రెడ్డి భేటీ అయ్యారు. శంకర్ రావును అరెస్ట్ చేయడంలో పోలీసులు అనుసరించిన తీరుపై చర్చిస్తున్నట్లు సమాచారం. పోలీసుల తీరును పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, విపక్ష నేతలు తప్పు పట్టిన సంగతి తెలిసిందే. పైగా మంత్రి దానం నాగేందర్ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఈ ఉదయం ఫిర్యాదు చేసారు. దీంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తునట్లు సమాచారం.

  • Loading...

More Telugu News