డాక్టర్ ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ ఇనిస్టిట్యూట్ లో అధికారులతో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం

Related image

పత్రికా ప్రకటన

23.05.2022

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు పథకాల అమలు పై రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ టి హరీష్ రావు పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న
లక్షలాదిమంది ప్రజల యొక్క అభ్యున్నతి కొరకై అమలు చేస్తున్న పథకాలైన ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ మరియు పాడి పశువుల పంపిణీ తదితర పథకాల పై జరిగిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తగిన సూచనలు సలహాలను ఈ సమావేశంలో ఇరువురు మంత్రులు అధికారులకు తెలియజేశారు. అంతేకాకుండా పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల  నిర్మాణం మరియు రావిర్యాల లో నిర్మిస్తున్న మెగా డైరీ నిర్మాణ పనుల పురోగతి పై సమీక్షించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వనరులలో చేప పిల్లలు మరియు రొయ్య పిల్లల విడుదలపై కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా,మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, డైరీ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases