వేసవిలో మంచినీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలి: వీఎంసీ కమిషనర్

Related image

  • పారిశుధ్యo మెరుగుదలకై అధికారులకు ఆదేశాలు కమిషనర్ పి.రంజిత్ భాషా
విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అధికారులతో కలసి లోటస్ ల్యాండ్ మార్క్, కేదారేశ్వర పేట, పెజోన్నిపేట, బాప్టిస్ పాలెం తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అందించు మంచినీటి సరఫరా విధానముపై స్థానిక ప్రజలను ఇబ్బందులను అడిగితెలుసుకొన్నారు. ముందుగా లోటస్ ల్యాండ్ మార్క్ నందు 14వ ఆర్దిక సంఘ నిధులతో చేపట్టిన రోడ్లు, డ్రెయిన్ లను మరియు ప్రజలకు అందుబాటులో గల పార్క్ స్థలమును పరిశీలించి అధికారులను వివిరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. కేదారేశ్వర పేట నందలి రిజర్వాయర్ ను పరిశీలించి ఏ విధముగా నీటిని నింపుతున్నది మరియు వాటర్ లెవెలింగ్ మీటర్ ను పరిశీలించిన సమయంలో ఇక్కడ నుండి ఏ ఏ సమయాలలో ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నది, తదితర వివరాలు అధికారులను అడిగితెలుసుకొని మంచినీటిలో క్లోరిన్ టెస్టింగ్ పరిశీలించారు.

అదే విధంగా లోటస్ ల్యాండ్ మార్క్, 34 మరియు 35వ డివిజన్ పరిధిలోని పెజోన్నిపేట, బాప్టిస్ పాలెం తదితర ప్రాంతాలలోని పలు వీదులలో నీటి సరఫరా విధానముపై స్థానిక ప్రజలకు అడిగి తెలుసుకొనిన సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్ 10వ రోడ్ లో కొంత మేర ఇబ్బందిగా ఉందని తెలిపిన దానిపై త్రాగునీటి సరఫరాకు సంబందత అధికారులను వివరాలు తెలుసుకొని చివరి నీరు అందేలా సరఫరా చేయునట్లుగా చూడాలని సూచించారు. పలు విధులలో ట్యాప్ లలోని నీటి శాంపిల్ పరిక్షలు పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ తీరు మరియు డ్రెయిన్ ద్వారా మురుగునీటి ప్రవాహమును పరిశీలించగా పలు చోట్ల చెత్త మరియు వ్యర్ధము ఉండుట మరియు డ్రెయిన్ నందు చెత్త వ్యర్ధము ఉండుట గమనించి మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానము అమలు చేయాలని మరియు డ్రెయిన్ లలో గల వ్యర్ధములను తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.నారాయణమూర్తి, వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.కె.సురేష్ బాబు మరియు ఇతర అధికారులు సిబ్బంది స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases