Ayyanna Patrudu: ఏపీ సీఐడీ కేసులో అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట

  • అయ్యన్నపై నర్సీపట్నంలో భూ ఆక్రమణ ఆరోపణలు 
  • కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
  • ఈ కేసులో సెక్షన్ 467 వర్తింపజేయలేరన్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
  • ఏపీ సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు
Supreme Court denies stay on High Court verdict over Ayyanna case

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలో భూ ఆక్రమణ ఆరోపణలపై ఏపీ సీఐడీ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. 10 ఏళ్లకు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని స్పష్టం చేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన ఎన్ఓసీ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని తేల్చిచెప్పింది. 

అయితే, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

More Telugu News