Team India: టెస్టు మ్యాచ్ లోనూ భారత్​ తడబాటు.. 50 లోపే ముగ్గురు ఔట్

  • టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • నిరాశ పరిచిన రాహుల్, గిల్, కోహ్లీ
  • ఏడు పరుగుల తేడాతో ముగ్గురూ పెవిలియన్ చేరిన వైనం
Team India lose 3 wickets early against bangladesh

ఫార్మాట్ మారినప్పటికీ బంగ్లాదేశ్ పర్యటనలో భారత బ్యాటర్ల ఆట మారడం లేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్ల పేలవ ఆటతీరును కనబరుస్తున్నారు. బంగ్లాదేశ్ తో మంగళవారం మొదలైన తొలి టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి డీలా పడింది. యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ (20)తో కలిసి ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (22) తొలి వికెట్ కు 41 పరుగులు జోడించాడు. మంచి పునాదే పడుతుందని అనుకుంటున్న సమయంలో బంగ్లాదేశ్ బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. ఏడు పరుగుల తేడాతో మూడు వికెట్లు పడగొట్టి భారత్ ను దెబ్బకొట్టారు. 

13వ ఓవర్లో శుభ్ మన్ గిల్ ను తైజుల్ ఇస్లాం పెవిలియన్ చేరగా.. కాసేపటికే ఖాలెద్ అహ్మద్ బౌలింగ్ లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ (1)ని తైజుల్ ఇస్లాం ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. దాంతో, యాభై పరుగుల్లోపే భారత్ మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి 48/3తో కష్టాల్లో పడింది. సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాతో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. 25  ఓవర్లకు భారత్ 76/3 స్కోరుతో నిలిచింది.

More Telugu News