Somireddy Chandra Mohan Reddy: రైతులు వరి పండిస్తే ప్రభుత్వానికి భారమనడం సిగ్గుచేటు: సోమిరెడ్డి

  • వరి పండించడమొక్కటే వ్యవసాయం కాదన్న కాకాణి
  • రైతులందరూ వరి వేస్తే కొనుగోలు కష్టమని వెల్లడి
  • మండిపడిన సోమిరెడ్డి
  • వైసీపీ హయాంలో వ్యవసాయశాఖ మూతపడిందని వ్యాఖ్యలు
Somireddy condemns Agriculture minister Kakani comments

వరి పండిస్తేనే వ్యవసాయం చేసినట్టు అనే ధోరణి నుంచి రైతులు బయటపడాలని, రైతులందరూ వరి పంట వేస్తే కొనుగోలు చేయడం ప్రభుత్వానికి భారంగా మారుతుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. 

కాకాణి, కన్నబాబు (మాజీ వ్యవసాయశాఖ మంత్రి) ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ మూతపడిందని విమర్శించారు. రైతులు వరి పండిస్తే ప్రభుత్వానికి భారమనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 

దేశంలో పత్తి రైతులే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సోమిరెడ్డి వెల్లడించారు. రెండేళ్లలో ఏపీ కంటే తెలంగాణ రైతులే ఎక్కువ వరి పండించారు అని వివరించారు. వైసీపీ హయాంలో యాంత్రీకరణ, బిందు సేద్యం, భూసార పరీక్షలు ఆగిపోయాయి... రైతులు రోడ్లపైకి వస్తున్నారు అని ఆరోపించారు.

More Telugu News