ICSE Class 10: ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!

  • ఎగ్జామ్స్ డేట్ షీట్‌ను ప్రకటించిన సీఐఎస్‌సీఈ 
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పదో తరగతి పరీక్షలు
  • ఫిబ్రవరి 13 నుంచి 12వ తరగతి పరీక్షలు
ICSE Class 10 and ISC Class 12 exams timetable released

ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ వచ్చే ఏడాది జరగనున్న సీఐఎస్‌సీఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీఐఎస్‌సీఈ 2023 డేట్ షీట్‌ను cisce.org ద్వారా చెక్ చేసుకోవచ్చు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 29 వరకు ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరగనుండగా, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 31 వరకు ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 2023లో ఫలితాలను వెల్లడిస్తారు. వెబ్‌సైట్‌లో పూర్తి షెడ్యూల్ అందుబాటులో ఉందని సీఐఎస్‌సీఈ పేర్కొంది. 

పరీక్ష హాలుకు విద్యార్థులు నిర్దేశిత సమయానికి ఐదు నిమిషాల ముందే రావాలని సూచించింది. ఆలస్యంగా వచ్చేవారు అందుకు సరైన కారణం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. అరగంటకు పైగా ఆలస్యమైతే పేపర్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే, ఎగ్జామ్ పూర్తికాకుండా హాలు నుంచి విద్యార్థులను బయటకు పంపరు.

More Telugu News