Varla Ramaiah: చిత్తూరు జిల్లా ఎస్పీపై కేసు నమోదు చేయండి: డీజీపీకి వర్ల రామయ్య లేఖ

  • ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న వర్ల 
  • పెద్దిరెడ్డి ఆదేశాలతో టీడీపీ శ్రేణులను టార్చర్ చేస్తున్నారని మండిపాటు
  • రిషాంత్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్
Varla Ramaiah complains on Chittoor SP to DGP

చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, టీడీపీ శ్రేణులను టార్చర్ కు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. 

గతంలో నర్సీపట్నంలో విధులు నిర్వహించే సమయంలో టీడీపీ కార్యకర్త యేలేటి సంతోష్ ను టార్చర్ చేయడంతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. సంతోష్ కు పరిహారం ఇవ్వాలన్న ఎన్ హెచ్చార్సీ ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదని... దీంతో, పోలీసులు న్యాయం చేయడం లేదంటూ సంతోష్ కోర్టుకు వెళ్లాడని చెప్పారు. 

ఈ క్రమంలో డిసెంబర్ 5న చీఫ్ సెక్రటరీ తమ ముందు హాజరు కావాలంటూ ఎన్ హెచ్చార్సీ ఆదేశించిందని... దీంతో, నిన్న హడావుడిగా పరిహారం ఇస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. ఎస్పీ పదవికి రిషాంత్ రెడ్డి పనికిరారని చెప్పారు. రిషాంత్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News