Nadendla Manohar: రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం రైతు భరోసా కేంద్రాలు; నాదెండ్ల మనోహర్

  • రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్నారన్న నాదెండ్ల 
  • రైతులను కులాల వారీగా గుర్తిస్తున్నారని విమర్శలు
  • ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ
Nadendla Manohar talks to media in Tenali

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం రైతు భరోసా కేంద్రాలు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10,700 రైతు భరోసా కేంద్రాల్లో అవినీతి జరుగుతున్నట్టు విజిలెన్స్ నివేదిక చెబుతోందని తెలిపారు. 

రైతుల వద్ద లంచాలు తీసుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ-క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక రైతులను కూడా కులాల వారీగా గుర్తిస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.   

అధికార పార్టీ నేతల వసూళ్లు పెరిగాయని తెలిపారు. గంజాయి కేసుల్లో చిన్నవాళ్లను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గంజాయి నిర్మూలన చేస్తున్నందుకే గత డీజీపీని తొలగించారని ఆరోపించారు.

More Telugu News