Telangana: స్వదస్తూరితో ప్రధాని మోదీకి పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన కేటీఆర్

  • చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలన్న కేటీఆర్
  • చేనేత సమస్యలను ప్రస్తావిస్తూ మోదీకి పోస్టు కార్డు రాసిన వైనం
  • తెలంగాణ ప్రజలు ప్రధానికి పోస్టు కార్డు రాయాలని వినతి
ktr starts post card protest to pm narendra modi

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం ఓ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పోస్టు కార్డుల ఉద్యమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ పోస్టు కార్డు తీసుకున్న కేటీఆర్... ప్రధాని మోదీకి చెప్పాలనుకున్న విషయాన్ని తన స్వదస్తూరితో రాశారు. 

రాష్ట్రంలోని చేనేత కార్మికులతో పాటు చేనేత ఉత్పత్తులపై ప్రేమ ఉన్న వారంతా ప్రధానికి పోస్టు కార్డు రాయాలంటూ ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాను రాసిన పోస్టు కార్డులో చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయడంతో పాటుగా చేనేత రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేటీఆర్ ప్రస్తావించారు. కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ నుంచి ప్రధానికి పెద్ద సంఖ్యలో పోస్టు కార్డులు వెళ్లే అవకాశాలున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి.

More Telugu News