Ukraine: ఎలాంటి ప్ర‌యాణాలు వద్దు!.. ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌కు ఇండియ‌న్ ఎంబ‌సీ సూచ‌న‌!

  • ఉక్రెయిన్ అధ్య‌క్ష భ‌వ‌నంపై దాడి చేసిన ర‌ష్యా
  • ఫ‌లితంగా అక్క‌డి త‌న పౌరుల భ‌ద్ర‌త‌పై భార‌త్ ఆందోళ‌న‌
  • కీవ్‌లోని ఎంబ‌సీతో ట‌చ్‌లో ఉండాలంటూ సూచ‌న‌లు
Advisory for all Indian Nationals in Ukraine

ర‌ష్యా బాంబుల మోత‌తో మ‌రోమారు ద‌ద్ద‌రిల్లుతున్న ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు మ‌రింత‌గా దిగ‌జారాయి. ఇలాంటి ఉద్రిక్త ప‌రిస్థితుల్లో ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌కు ఇండియన్ ఎంబ‌సీ ఓ అడ్వైజ‌రీని విడుద‌ల చేసింది. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు పెట్టుకోవ‌ద్ద‌ని, అత్యవ‌స‌ర‌మైతే త‌ప్పించి ప్ర‌యాణాలు చేయ‌వ‌ద్ద‌ని భార‌త విదేశాంగ శాఖ ఉక్రెయిన్‌లోని భారత పౌరులకు సూచించింది. అంతేకాకుండా, నిత్యం కీవ్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యంతో సంబంధాలు కొన‌సాగించాల‌ని తెలిపింది. 

ప్ర‌స్తుతం త‌మ ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యాన్ని ఎంబ‌సీకి తెలియ‌జేయాల‌ని భార‌త విదేశాంగ శాఖ‌ వెల్ల‌డించింది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం కొన‌సాగిస్తున్నా... గ‌డ‌చిన కొంత‌కాలంగా అక్క‌డ పెద్ద‌గా ఉద్రిక్త‌త‌లు క‌నిపించ‌లేదు. అయితే సోమ‌వారం ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ సహా అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుని ర‌ష్యా క్షిపణులు ప్ర‌యోగించింది. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా అప్ర‌మ‌త్త‌మైన భార‌త్‌... అక్క‌డి త‌న పౌరుల‌కు జాగ్ర‌త్త‌లు చెబుతూ అడ్వైజ‌రీ విడుద‌ల చేసింది.

More Telugu News