Allari Naresh: నితిన్ చేతుల మీదుగా ' ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' లిరికల్ సాంగ్ రిలీజ్!

  • అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'
  • పొలిటికల్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ 
  • కథానాయికగా అలరించనున్న ఆనంది
  • త్వరలోనే విడుదల కానున్న సినిమా
Itlu Maredumilli Prajaneekam movie song released

అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. కెరియర్ పరంగా అల్లరి నరేశ్ కి ఇది 59వ సినిమా. మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ ఇది. అల్లరి నరేశ్ సరసన నాయికగా ఆనంది నటించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు.


తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును వదిలారు. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు. " నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా .. నా చేతి గీతలో కొత్తరేఖవైనావా .. లచ్చిమీ .. నీ ఎనక ఎనక వస్త కనకలచ్చిమి " అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ ఆలపించాడు. నాయిక పట్ల తన ప్రేమను చాటుతూ నాయకుడు పాడే పాట ఇది.   


పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టుగా దర్శకుడు చెబుతున్నాడు. వెన్నెల కిశోర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉన్న అల్లరి నరేశ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి

More Telugu News