Xi Jinping: మళ్లీ మొదటికొచ్చిన జిన్‌పింగ్ వ్యవహారం.. మొన్న కనిపించింది ఒరిజనల్ కాదట!

  • జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధం చేసిందంటూ ఇటీవల వార్తలు
  • ఫొటోలు, వీడియోలు విడుదల చేసిన చైనా అధికారిక మీడియా
  • అందులో కనిపించింది జిన్‌పింగ్ డూప్ అంటూ ప్రచారం
Xi Jinping photos and videos that are released by chines media are fake

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధంలో ఉంచిందని, అధికారాన్ని హస్తగతం చేసుకుందంటూ ఇటీవల వార్తలు హోరెత్తాయి. ఈ విషయంలో చైనా అధికారిక మీడియా ఎలాంటి ప్రకటన చేయకున్నా.. సోషల్ మీడియా మాత్రం కోడై కూసింది. అంతేకాదు, బీజింగ్‌ను సైన్యం చుట్టిముట్టిందంటూ వీడియోలు కూడా బయటకొచ్చి హల్‌చల్ చేశాయి.

ఇంత ప్రచారం జరిగినా చైనా మీడియా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఈ ప్రచారం ఇలా జరుగుతుండగానే రెండు రోజుల క్రితం రాజధాని బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జిన్‌పింగ్ పాల్గొన్నట్టు చూపుతూ అక్కడి అధికారిక మీడియా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఫలితంగా జిన్‌పింగ్ గృహనిర్బంధం వార్తలు అన్నీ ఉత్తవేనంటూ తేల్చి పడేశారు. 

అయితే, ఆ ఫొటోలు వెలుగులోకి వచ్చిన కాసేపటికే మళ్లీ ఈ వ్యవహారం మొదటికి వచ్చింది. ఆ ఫొటోలు ఫేక్ అని పలువురు కొట్టిపడేస్తున్నారు. చైనా అధికారిక మీడియా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లో ఉన్నది అసలు సిసలైన ఒరిజినల్ జిన్‌పింగ్ కాదని, ఆయన డూప్ అని చెబుతున్నారు. ఇంకొందరేమో అవి పాత ఫొటోలని కొట్టిపడేస్తున్నారు. 

ఇక ఆ ఫొటోల్లో జిన్‌పింగ్ కుడి చెవి, గొంతు భాగాల్లో తేడాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు, ఒరిజనల్ జిన్‌పింగ్‌తో పోలిస్తే ఫొటోల్లో కనిపించిన వ్యక్తి వయసు దాదాపు పదేళ్లు తక్కువగా ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా అవి ఫేక్ ఫొటోలు, వీడియోలేనని తేల్చి చెబుతుండడంతో జిన్‌పింగ్ గృహ నిర్బంధం అంశం మరోమారు తెరపైకి వచ్చింది.

More Telugu News