Hyderabad: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో

  • ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్
  • ఈ నెల 25న మ్యాచ్ డే నాటి రాత్రి 12.30 దాకా మెట్రో రైళ్లు
  • రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యనూ పెంచుతామన్న మెట్రో ఎండీ
on 25th of this month metro services will run upto mid night

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఇక వివాదాలన్నింటినీ పక్కనపెట్టేసి 25న జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇదిలావుంచితే, మ్యాచ్ జరిగే ఈ నెల 25న క్రికెట్ ఫ్యాన్స్ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు దాటనుంది. ఈ సమయంలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఇళ్లకు వెళ్లేందుకు నగరంలో ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రికెట్ ఫ్యాన్స్ రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే విషయంపై కూడా దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News