Babli Bouncer: మీడియా ప్రతినిధులపై న‌టి త‌మ‌న్నా బౌన్స‌ర్ల దాడి.. ఇద్ద‌రు కెమెరామెన్లకు గాయాలు

  • త‌మ‌న్నా ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన బ‌బ్లీ బౌన్స‌ర్‌
  • చిత్ర ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన న‌టి
  • మీడియా స‌మావేశం త‌ర్వాత మొద‌లైన వివాదం
  • మీడియా ప్ర‌తినిధుల‌తో వాగ్వాదం, ఆపై ఘ‌ర్ష‌ణ‌కు దిగిన బౌన్స‌ర్లు
tamannaah bouncers attacks media representatives in hyderabad

ద‌క్షిణాది భాషా చిత్రాల్లో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సినీ న‌టి త‌మ‌న్నా శ‌నివారం ఓ వివాదంలో చిక్కుకున్నారు. తాను ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన 'బ‌బ్లీ బౌన్స‌ర్' చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన త‌మ‌న్నా... న‌గ‌రంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా విధి నిర్వహణలో వున్న మీడియా ప్ర‌తినిధుల‌పై త‌మ‌న్నాకు ర‌క్ష‌ణ‌గా వ‌చ్చిన బౌన్స‌ర్లు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్ద‌రు కెమెరామెన్ల‌కు గాయాల‌య్యాయి. 

బ‌బ్లీ బౌన్స‌ర్ మీడియా స‌మావేశం ముగిసిన త‌ర్వాత మీడియా ప్ర‌తినిధుల‌తో త‌మ‌న్నా బౌన్స‌ర్లు వాగ్వాదానికి దిగారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు కూడా బౌన్స‌ర్ల‌ను నిల‌దీయ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదంతో పాటు ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ సంద‌ర్భంగానే త‌మ‌న్నా బౌన్స‌ర్లు మీడియా ప్ర‌తినిధుల‌పై దాడికి దిగారు.

More Telugu News