AP Assembly Session: ముగిసిన బీఏసీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల దినాలు, చర్చించే అంశాలపై నిర్ణయం

  • ఐదు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని నిర్ణయం
  • మొత్తం 27 అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకారం
  • టీడీపీ తరపున సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడు
AP assembly sessions to be conducted for 5 days

ఏపీ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాదు, మొత్తం 27 అంశాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ రాజులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

టీడీపీ తరపున అచ్చెన్నాయుడు సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. ఉద్యోగాల అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సభను అదుపు చేయడానికి స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.

More Telugu News