Shootings: సెప్టెంబరు 1 నుంచి టాలీవుడ్ లో మళ్లీ షూటింగులు

  • వివిధ కారణాలతో నిలిచిన షూటింగులు
  • గత 23 రోజులుగా చర్చించామన్న దిల్ రాజు
  • కీలక నిర్ణయం తీసుకున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్
  • విదేశాల్లో ఈ నెల 25 నుంచి షూటింగులు
Tollywood shootings starts from September 1st

వివిధ కారణాలతో గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో షూటింగులు నిలిచిపోవడం తెలిసిందే. షూటింగుల బంద్ కు పలు సినీ సంఘాల మద్దతు ఉంది. కాగా, చిత్ర పరిశ్రమలో మళ్లీ షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి. దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సెప్టెంబరు 1 నుంచి పూర్తిస్థాయిలో చిత్రీకరణలు షురూ అవుతాయని వెల్లడించారు. షూటింగ్ లు మళ్లీ ప్రారంభం కావడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత 23 రోజులుగా సినీ రంగ సమస్యలపై చర్చించినట్టు వివరించారు. ఆగస్టు 30న తుది నిర్ణయంపై ప్రకటన ఉంటుందని అన్నారు. 

ఇకపై అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు ఉంటాయని, పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని దిల్ రాజు చెప్పారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు వీపీఎఫ్ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. 

సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ, విదేశాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్న చిత్రాలు ఆగస్టు 25 నుంచి షూటింగులు జరుపుకోవచ్చని తెలిపారు. అత్యవసరమైతే ఫిలిం చాంబర్ అనుమతితో ఆగస్టు 25 నుంచి చిత్రీకరణలు జరుపుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News