BJP: 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈసీ

  • కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర.. సెలవు దొర' ప్రచారం
  • పోస్టర్లు ముద్రించేందుకు ఈసీ అనుమతి కోరిన బీజేపీ
  • నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు ఉండకూడదన్న ఈసీ
EC objects Saalu Dora Sampaku Dora poster of BJP

తెలంగాణ బీజేపీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. 'సాలు దొర.. సెలవు దొర' ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో పెట్టి ఈ నినాదంతో పోస్టర్లను ముద్రించేందుకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు తెలిపింది. కేసీఆర్ పాలనను విమర్శిస్తూ బీజేపీ ఈ ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా 'సాలు దొర.. సెలవు దొర' అనే డిజిటిల్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇదే నినాదంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలో ''సాలు దొర.. సెలవు దొర' ప్రచారానికి అనుమతిని కోరుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఆశ్రయించింది. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది.

More Telugu News