Telangana: చేనేత‌, ఖాదీ ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధించిన తొలి ప్ర‌ధాని మోదీ: కేటీఆర్ విమ‌ర్శ‌

  • గాంధీ ఆత్మ నిర్భ‌ర్ చిహ్నం చ‌ర‌ఖాను గుర్తు చేసిన‌ కేటీఆర్‌
  • చేనేత‌పై జీఎస్టీ విధించిన తొలి ప్ర‌ధానిగా మోదీకి గుర్తింపు ద‌క్కింద‌ని ఎద్దేవా
  • ఇదేనా మీరు జాతికి తెలియ‌జెప్పే స్వ‌దేశీ నినాదం? అని ప్ర‌శ్న‌
ktr satires on pm modi over gston cheneta and khadi

ఇటీవలి కాలంలో కేంద్రం వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్న టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం మ‌రోమారు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. జాతి పిత మ‌హాత్మాగాంధీని గుర్తు చేస్తూ ఆయ‌న మోదీపై సెటైర్లు వేశారు. 

స్వ‌దేశీ స్ఫూర్తిని ప్ర‌జ‌ల్లో పెంపొందించ‌డానికి నాడు మ‌హాత్మా గాంధీ ఆత్మ నిర్భ‌ర్ చిహ్నంగా చ‌ర‌ఖాను ఉప‌యోగిస్తే... నేడు చేనేత‌, ఖాదీ ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధించిన తొలి ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీకి ఓ గుర్తింపు ద‌క్కింద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇదేనా మీరు సాధించిన ఆత్మ నిర్భ‌ర్ భార‌త్? అంటూ కేటీఆర్ ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం జాతికి తెలియ‌జెప్పే స్వ‌దేశీ నినాదం ఇదేనా? అని కూడా ఆయ‌న విమ‌ర్శించారు. ఈ మేర‌కు మంగ‌ళవారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

More Telugu News