Team India: కామన్వెల్త్ క్రీడల్లో నేడు భారత్, పాకిస్థాన్ మహిళల మ్యాచ్... వర్షం కారణంగా ఓవర్లు కుదింపు

  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • రెండో ఓవర్లోనే తొలి వికెట్ డౌన్
  • పాక్ ఓపెనర్ ను డకౌట్ చేసిన మేఘనా సింగ్
India takes off Pakistan in Commonwealth Games

కామన్వెల్త్ క్రీడల్లో ఇవాళ దాయాదుల సమరం జరుగుతోంది. గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా, పాకిస్థాన్ మహిళలు తలపడుతున్నారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియా బౌలర్ మేఘనా సింగ్ ధాటికి పాక్ జట్టు రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మేఘనా సింగ్ బౌలింగ్ లో ఓపెనర్ ఇరామ్ జావెద్ డకౌట్ అయింది. 

ప్రస్తుతం పాక్ మహిళల జట్టు 4 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. ఓపెనర్ మునీబా అలీ (4 బ్యాటింగ్), కెప్టెన్ బిస్మా మారూఫ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఇరుజట్లకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే, ఈ గ్రూప్ లో తన తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోగా, పాక్ జట్టును బార్బడోస్ జట్టు ఓడించింది. దాంతో నేటి మ్యాచ్ లో గెలుపు ఇరుజట్లకు కీలకంగా మారింది.

More Telugu News