Jagan: నేడు కోనసీమలో పర్యటించనున్న జగన్.. రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్న సీఎం!

  • పి.గన్నవరం మండలం, రాజోలు మండలాల్లో పర్యటించనున్న సీఎం
  • వరద బాధితులతో ముఖాముఖి మాట్లాడనున్న జగన్
  • ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగనున్న సీఎం పర్యటన
Jagan visiting Konaseema District today

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆయన కలవనున్నారు. నేరుగా వారితో మాట్లాడనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం పర్యటన కొనసాగనుండటంతో.. అధికారులు రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. 

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయల్దేరుతారు. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో ఆయన ముఖాముఖి సమావేశం అవుతారు. అనంతరం అరిగెలవారిపేట, ఉడిమూడిలంక చేరుకుని వరద బాధితులతో మాట్లాడతారు. 

మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి, రాజోలు మండలం మేకలపాలెంలో పర్యటిస్తారు. అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రికి చేరుకుని... అక్కడి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే బస చేస్తారు.

More Telugu News