Sensex: వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 390 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 114 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కనిపిస్తోంది. వరుసగా ఆరో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఫైనాన్సియల్ స్టాక్స్ మార్కెట్లను ముందుండి నడిపించాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు రావడం మార్కెట్లలో జోష్ ను పెంచింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 56,072కి చేరుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 16,719 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (5.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.42%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.39%), యాక్సిస్ బ్యాంక్ (2.14%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.70%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.70%), ఎన్టీపీసీ (-0.90%), విప్రో (-0.87%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.86%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.83%).

More Telugu News